Page Loader
అల్లు అర్వింద్ రామాయణం : రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి ఖరారు
సీతగా సాయిపల్లవి ఖరారు

అల్లు అర్వింద్ రామాయణం : రాముడిగా రణ్‌బీర్‌ కపూర్.. సీతగా సాయిపల్లవి ఖరారు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 04, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామాయణం సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో తారాగణానికి సంబంధించిన విషయం ఆకట్టుకుంటోంది. రామాయణాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్‌కు చెందిన దర్శకుడు నితేశ్‌ తివారీ కసరత్తులు చేస్తున్నారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అర్వింద్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీత పాత్రలో సాయి పల్లవి ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో సీత పాత్ర కోసం అలియా భట్ ను ఎంపిక చేసినట్లు టాక్‌ నడిచింది. త్వరలోనే పల్లవికి లుక్‌ టెస్ట్‌ చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు భాగాల్లో చిత్రాన్ని తీసుకురానున్నారు. చిత్రంలో కీలకమైన రావణుడి పాత్రను, కేజీఎఫ్ స్టార్ యశ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

EMBED

త్వరలోనే రణ్‌బీర్‌ కపూర్, సాయిపల్లవితో బాలీవుడ్ రామాయణం

https://twitter.com/comicverseyt/status/1709236973179961711