Loading...
Ramayana Movie Ticket Prices: 'రామాయణ' టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. రూ.99కే సినిమా చూసే అవకాశం!
'రామాయణ' టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. రూ.99కే సినిమా చూసే అవకాశం!

Ramayana Movie Ticket Prices: 'రామాయణ' టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. రూ.99కే సినిమా చూసే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

రణ్‌ బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ' (Ramayana) టికెట్ ధరలను చిత్ర బృందం భారీగా తగ్గించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేగం తగ్గడంతో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ఈ సినిమా టికెట్లు కేవలం రూ.99 నుంచే అందుబాటులోకి వచ్చాయని టీమ్ ప్రకటించింది. కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు ఏకంగా 80 శాతం వరకు తగ్గాయి.

వివరాలు

2డీ టికెట్ రూ.99.. 3డీ ధరలు ఇలా!

గతంలో రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న 2డీ టికెట్లు ఇప్పుడు రూ.99కే లభిస్తున్నాయి. ఇక 3డీ టికెట్ల ధరలు రూ.119 నుంచి రూ.249 వరకు నిర్ణయించారు.

ఐమ్యాక్స్ షోలకు కూడా టికెట్ ధరలను తగ్గించారు. అయితే ప్రీమియం సీట్లు, కొన్ని ప్రత్యేక ఫార్మాట్ల టికెట్ల ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు.

అవి గతంలో మాదిరిగానే అధిక ధరల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు

తగ్గిన బాక్సాఫీస్ వసూళ్లు

ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. విడుదలైన తొలి రోజుల్లో భారీ వసూళ్లు సాధించిన 'రామాయణ'కు ఇటీవల కలెక్షన్ల జోరు తగ్గింది.

నవంబర్ 23న ఈ సినిమా కేవలం రూ.12.70 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1,700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.

అదే సమయంలో భారత్‌లో రూ.955 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

వసూళ్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకుల ఆదరణను మళ్లీ పెంచుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT