Parliament: ఫిబ్రవరి 15న పార్లమెంటులో 'రామాయణం' సినిమా ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్నారు.
గీక్ పిక్చర్స్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని పార్లమెంటులో ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గీక్ పిక్చర్స్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ ప్రకటనలో, 'ఈ ప్రదర్శన తమకు స్ఫూర్తినిచ్చే అనుభవంగా నిలుస్తుందని అన్నారు.
Details
1993లో విడుదలైన రామాయణం
1993లో విడుదలైన 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' యానిమేటెడ్ చిత్రం 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు.
కానీ కొన్ని కారణాల వల్ల థియేటర్లలో దీని ప్రదర్శన జరగలేదు. 2000లో టీవీలో ప్రదర్శించగా, అది ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.
ఇక 4కే వెర్షన్‌ను జనవరి 10న విడుదల చేసి, కొత్తగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రాన్ని గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
రామ్ మోహన్, యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ రచన అందించారు.