Ramcharan: రామ్‌చరణ్ ఆరోగ్యంపై 'పెద్ది' మేకర్స్ స్పందన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌కు ఇటీవల మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆయన నటించిన 'పెద్ది' సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. రామ్‌చరణ్‌కు కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రిలో ఛైర్మన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరిగింది. అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ హ్యాండ్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బాడియా బృందంతో పాటు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
వివరాలు
అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్..
శస్త్రచికిత్స సందర్భంగా రామ్‌చరణ్‌తో పాటు ఆయన భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కూడా కోయంబత్తూరుకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలైన 'పెద్ది' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్‌చరణ్, తదుపరి దర్శకుడు సుకుమార్‌తో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కథా రచన దాదాపు పూర్తయినట్లు సమాచారం.
మరోవైపు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తైతే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.