Page Loader
Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్లు' నిర్మాతకి రామ్ చరణ్,రాజమౌళి ప్రశంసలు ఏమన్నారంటే..  
Committee Kurrollu: కమిటీ కుర్రోళ్లు నిర్మాతకి రామ్ చరణ్,రాజమౌళి ప్రశంసలు ఏమన్నారంటే..

Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్లు' నిర్మాతకి రామ్ చరణ్,రాజమౌళి ప్రశంసలు ఏమన్నారంటే..  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2024
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న సినిమాగా రిలీజ్‌గా మొదలైన యూత్-సెంట్రిక్ పల్లెటూరి డ్రామా కమిటీ కుర్రోళ్లు. ఇప్పుడు ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి య‌దు వంశీ దర్శకత్వం వహించగా,మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మాత వ్యవహరించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలే కాదు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్‌ కూడా అందుకుంటోంది. ఇటీవలే మహేష్ బాబు,సుకుమార్,నాగ్ అశ్విన్,క్రిష్,దేవి శ్రీ ప్రసాద్, దర్శక ధీరుడు SS రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ నిర్మాత నిహారిక కొణిదెలకు శుభాకాంక్షలు తెలిపారు. నేచురల్ స్టార్ నాని కూడా సినిమా కంటెంట్,ఎగ్జిక్యూషన్‌ను ప్రశంసిస్తూ నిహారికకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెలబ్రిటీల నుండి వచ్చిన గుర్తింపుతో బృందం ఆనందంగా ఉంది.

వివరాలు 

చెల్లికి  రామ్‌ చరణ్‌ ప్రశంసలు 

తాజాగా రామ్‌ చరణ్‌ నిహారికపై ప్రశంసలు కురిపించారు. 'కమిటీ కుర్రోళ్లు' ఘనవిజయం సాధించినందుకు అభినందనలు నిహారిక తల్లి! మీ టీంతో పాటు నీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ మూవీ కాస్ట్‌ అండ్‌ క్రూ ఎఫర్ట్స్‌కి అభినందనలు. ఇక ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక అభినందనలు!" అంటూ చెల్లి నిహారికపై ప్రశంసలు కురిపించాడు చరణ్‌. ఈ చిత్రంలో సందీప్ సరోజ్,యస్వంత్ పెండ్యాల,ఈశ్వర్ రాచిరాజు,త్రినాధ్ వర్మ,ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. కమిటీ కుర్రోలు సినిమాకి అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాలో మొత్తం 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం అయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాంచరణ్ చేసిన ట్వీట్