Page Loader
Ram Charan Mumbai : సిద్ధి వినాయకుడి సన్నిధిలో రామ్ చరణ్‌.. లంబోదరుడికి ప్రత్యేక పూజలు

Ram Charan Mumbai : సిద్ధి వినాయకుడి సన్నిధిలో రామ్ చరణ్‌.. లంబోదరుడికి ప్రత్యేక పూజలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 04, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ మెగా హీరో రామ్‌చరణ్‌ ముంబై పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చరణ్‌కు ఆలయ పూజారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తర్వాత శాలువాతో సత్కరించారు. మరోవైపు చరణ్‌ తన కొత్త ఫ్రెండ్‌ (గుర్రం)ను పరిచయం చేశారు. ఇదే నా కొత్త ఫ్రెండ్‌ బ్లేజ్‌ అంటూ సోషల్ మీడియాలో ఫొటో షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే అశ్వం తలపై నిమురుతూ చరణ్ మెరిశారు. మొదట్నుంచి హార్స్ రైడింగ్ అంటే చెర్రీకి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే చరణ్ వద్ద కాజల్‌, బాద్‌ షా అనే రెండు గుర్రాలున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి బ్లేజ్ వచ్చి చేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై సిద్ది వినాయకుడి సన్నిధిలో నటుడు రామ్ చరణ్

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఇదే నా కొత్త ఫ్రెండ్ బ్లేజ్: రామ్ చరణ్