Page Loader
Rana Daggubati Show: ది రానా దగ్గుబాటి షో.. ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్
ది రానా దగ్గుబాటి షో.. ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్

Rana Daggubati Show: ది రానా దగ్గుబాటి షో.. ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆహా వీడియోలో ఇప్పటికే ఉన్న ఎన్బీకేతో(NBK) అన్‌స్టాపబుల్(Unstoppable) షో గురించి తెలుసు కదా? ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఒక కొత్త తెలుగు టాక్ షో రాబోతోంది. ఈ షోలో రానా దగ్గుబాటి తెలుగు సినిమా ప్రముఖులైన నాగ చైతన్య, ఎస్.ఎస్.రాజమౌళి, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులతో రానా ముచ్చటిస్తాడు.

వివరాలు 

రానా దగ్గుబాటి షో 

ఈ సరికొత్త షో పేరు 'ది రానా దగ్గుబాటి షో'. ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ నవంబర్ 23న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. "మీకు తెలిసిన స్టార్లు, మీకు తెలియని కథలు" అనే ట్యాగ్‌లైన్‌తో షోను ప్రకటించింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సిరీస్‌లో ప్రముఖులు తమ వ్యక్తిగత విశేషాలను పంచుకుంటారు. షో ప్రత్యేకత ఇప్పటి వరకు వచ్చిన టాక్ షోలకు భిన్నంగా, రానా దగ్గుబాటి షోలో సెలబ్రిటీలు రానాతో కలిసి తమ జీవితం గురించి కొత్త విశేషాలను వెల్లడిస్తారు. ప్రొఫెషనల్ జీవితం కాకుండా, వ్యక్తిగత హాబీల గురించి కూడా పంచుకోనున్నారు.

వివరాలు 

గెస్టుల లిస్ట్ 

ఈ షోకు రానున్న అతిథుల్లో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సిద్దూ జొన్నలగడ్డ, నాని, రాజమౌళి, శ్రీలీల, రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. ఈ లిస్ట్, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రానా గతంలో చేసిన షోలకు భిన్నంగా ఉండే ఈ షో ద్వారా ప్రముఖుల జీవితాల అజ్ఞాత కోణాలు వెల్లడిస్తానని రానా చెబుతున్నాడు. స్ట్రీమింగ్ వివరాలు నవంబర్ 23న మొదలుకానున్న ఈ షో ప్రతి శనివారం ప్రైమ్ వీడియోలో ఒక ఎపిసోడ్ వస్తుంది.