
Rana Daggubati: కాళ్లు మొక్కిన రానా.. సీనియర్లు అంటే ఎంత గౌరవమో!
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఇండియన్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తమ సత్తాను చాటుతున్నారు.
ఈ నేపథ్యంలో ఐఫా 2024 స్పెషల్ ఈవెంట్‌లో రానా దగ్గుబాటి చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఈవెంట్ ముంబైలో మంగళవారం జరిగింది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్, రానా దగ్గుబాటి, సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ ఈ తరం పిల్లలు పెద్దవాళ్ల కాళ్లు ఎలా నమస్కరిస్తారో తెలుసా? అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.
Details
రానాను హాగ్ చేసుకున్న షారుక్ ఖాన్
దీనికి రానా దగ్గుబాటి స్పందిస్తూ తాను పూర్తి సౌత్ ఇండియన్ అని, తమ సంస్కృతి ఇలా ఉంటుందంటూ స్టేజీపై షారుక్ ఖాన్, కరణ్ జోహార్ కాళ్లకు నమస్కారం చేశాడు.
దీంతో షారుక్ ఖాన్ నవ్వుతూ రానాను హాగ్ చేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీనియర్లు అంటే రానాకు ఎంతో గౌరవమని సినీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.