Page Loader
Ranveer Allahbadia: వివాదాస్పదంగా రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్..
వివాదాస్పదంగా రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్..

Ranveer Allahbadia: వివాదాస్పదంగా రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు ఆయనపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రణవీర్ అల్లాబాడియా క్షమాపణలు చెప్పాడు. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ యూట్యూబర్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

వివరాలు 

రణవీర్ క్షమాపణలు

''నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాకుండా, ఫన్నీ కాదు, హాస్యం నా బలం కాదు, నేను క్షమాపణలు చెబుతున్నా'' అంటూ ఎక్స్‌లో ఒక వీడియో సందేశంలో క్షమాపణలు చెప్పారు. ''ఇండియాస్ గాట్ లాలెంట్ షో''లో రణవీర్ అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. షోలో పాల్గొన్న ఓ మహిళా కంటెస్టెంట్‌ను ఉద్దేశించి, ''మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా? లేదా ఒక సారి వారితో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా..?'' అని అడిగాడు. ఈ వ్యాఖ్యలు షోలో పాల్గొన్న వారిని షాక్‌కు గురిచేశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో, చివరకు రణవీర్ క్షమాపణలు చెప్పాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ వీడియో ..