
AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై రణ్‌వీర్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'AA 22' గురించి ఇప్పటికే సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో ఆయన భార్య దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సెట్‌ను సందర్శించినట్లు తెలిపారు. అట్లీపై (Atlee) ప్రశంసల వర్షం కురిపించారు.
వివరాలు
అల్లు అర్జున్ సినిమా షూటింగ్ సెట్‌కి వెళ్లాను: రణ్‌వీర్ సింగ్
"అట్లీ 'జవాన్'తో ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత పెద్ద దర్శకుల్లో ఒకరు. 'మెర్సల్' సినిమా చూసిన తర్వాతనే నేను ఆయనకు మెసేజ్ చేసి, 'మీతో సినిమా చేయాలని ఉంది, ముంబయికి రండి' అని చెప్పాను. ఆయనతో కలిసి పని చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయనతో ఉంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఇటీవల అల్లు అర్జున్ సినిమా షూటింగ్ సెట్‌కి వెళ్లాను. ఆ సెట్ అద్భుతంగా ఉంది. మీరు ఇప్పటివరకూ చూడని ఒక అద్భుతాన్ని అట్లీ తెరపై చూపించబోతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇంత వైభవమైన చిత్రం ఇప్పటివరకు చూడలేదు" అని రణ్‌వీర్ సింగ్ తెలిపారు.
వివరాలు
ప్రతి గొప్ప చిత్రం ఒక ఆలోచనతోనే మొదలవుతుంది
ఇక దర్శకుడు అట్లీ కూడా ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, "ప్రతి గొప్ప చిత్రం ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. AA 22'తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని మేము కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా, ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం" అని పేర్కొన్నారు.