Rashmika- Vijay: విజయ్ దేవరకొండ- రష్మిక కలిసే ఉంటున్నారా? దీపావళి ఫొటోలతో మొదలైన చర్చ
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న- రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఇద్దరు అప్పడప్పుడు చెట్టాల్ పట్టాల్ వేసుకొని కనిపించడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. ప్రేమ పుకార్లతో ఈ జంట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే దీపావళి సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక వేర్వేరుగా తమ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటోలతో ఈ జంట మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక, విజయ్ షేర్ చేసిన ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ ఒకే విధంగా ఉండంటతో ఇద్దరు కలిసే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు కలిసి ఉంటున్నారని, మరోసారి దొరికిపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు.