
రష్మిక మందన్న బర్త్ డే: పక్కింటి అమ్మాయి గుర్తింపు మారుతోంది
ఈ వార్తాకథనం ఏంటి
ఛలో సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో ఆమె ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.
ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక, గీత గోవిందం సినిమాతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎవ్వరికీ కనిపించలేదు. పక్కింటి అమ్మాయిగానే ఆమెను గుర్తు పెట్టుకున్నారు.
హీరోయిన్ కి ఉండాల్సిన హంగులు ఆమెలో కనిపించకపోవడంతో కుర్రకారును ఎక్కువగా ఆకర్షించింది. గీతగోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల్లో అలరించిన రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. నేషనల్ క్రష్ గా మారడంతో బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి.
రష్మిక మందన్న
బాలీవుడ్ లో పాగా వేసేందుకు రష్మిక ప్రయత్నాలు
అయితే బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్న ప్రస్తుత సమయంలో, రష్మిక మందన్న గ్లామరస్ గా కనిపించేందుకు ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచిందనీ అంటున్నారు.
దానివల్ల జనాల్లో పక్కింటి అమ్మాయి అన్న ఇమేజ్ తగ్గిపోయే ఛాన్స్ ఉందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో రష్మికకు సరైన హిట్ పడలేదు.
సీతారామంలో మంచి పాత్ర చేసినప్పటికీ అందులో ఆమె కంటే ఎక్కువ పేరు హీరో హీరోయిన్లకే వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు.
ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా, అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా రూపొందుతున్న రెయిన్ బో చిత్రంలోనూ నటిస్తోంది.