NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / శ్రీలీలకు బదులుగా రష్మిక.. ముచ్చటగా మూడోసారి కనునవిందు చేయనున్న యువ జంట  
    తదుపరి వార్తా కథనం
    శ్రీలీలకు బదులుగా రష్మిక.. ముచ్చటగా మూడోసారి కనునవిందు చేయనున్న యువ జంట  
    ముచ్చటగా మూడోసారి కనునవిందు చేయనున్న యువ జంట

    శ్రీలీలకు బదులుగా రష్మిక.. ముచ్చటగా మూడోసారి కనునవిందు చేయనున్న యువ జంట  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 26, 2023
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ 12వ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

    ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా ఎంపిక చేశారు. అయితే ఈ చిత్ర పూజా కార్యక్రమం సైతం పూర్తైంది. ఈ మేరకు షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

    ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల వైదొలిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.టాలీవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్ గా శ్రీలీల పేరు గాంచింది. చేతిలో దాదాపుగా 10 చిత్రాలున్నాయి. ఈ నేపథ్యంలోనే డేట్లు సర్దుబాటు కాక VD 12వ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

    మరోవైపు శ్రీలీల, లేదా చిత్ర యూనిట్ నుంచి ఈ మేరకు అధికారిక సమాచారం రాలేదు.ఈ నేపథ్యంలోనే తాజాగా VD 12 గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది.

    details

    ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లో నటించిన యువ జంట

    శ్రీలీలకు బదులుగా రష్మికని ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్-రష్మిక ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.

    మరోవైపు విజయ్, రష్మికలు మంచి మిత్రులుగా ఇప్పటికే పలు చిత్ర పరిశ్రమల్లో ముద్రపడ్డారు. అంతేకాకుండా వీరి మధ్య సమ్ థింగ్ స్పెషల్ అని, అది కాస్తా ప్రేమగా మారిందని వార్తలు గుప్పుమంటున్నాయి.

    అయితే పలు సందర్భాల్లో దీనిపై స్పందించిన ఈ యువ హీరో హిరోయిన్లు తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు.

    విజయ్- రష్మిక జోడికి అభిమానులు సైతం ఉన్నారంటే అది వీరి కాంబోకి ఉన్న కెమిస్ట్రీ వల్లేనని అందరికీ తెలిసిందే. శ్రీలీల బదులుగా రష్మి నటిస్తే ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులని మెప్పించనున్నారు. ఈ మేరకు ప్రేక్షకులు, అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్ దేవరకొండ

    తాజా

    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు సుబ్రమణ్యం జైశంకర్
    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం

    విజయ్ దేవరకొండ

    సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం తెలుగు సినిమా
    ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025