LOADING...
Rashmika : రష్మిక కొత్త ప్రాజెక్ట్.. మరో హారర్ మూవీలో కీలక పాత్ర?
రష్మిక కొత్త ప్రాజెక్ట్.. మరో హారర్ మూవీలో కీలక పాత్ర?

Rashmika : రష్మిక కొత్త ప్రాజెక్ట్.. మరో హారర్ మూవీలో కీలక పాత్ర?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. ఇటీవల 'కుబేర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, రాబోయే దీపావళికి 'థామా'అనే హారర్ లవ్‌స్టోరీలో నటించి మరోసారి అలరించనుంది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఇదిలా ఉండగా,రష్మిక పేరు ఇప్పుడు మరో హారర్ ప్రాజెక్ట్‌తోనూ బలంగా వినిపిస్తోంది. ప్రేక్షకులను హారర్ కామెడీ జానర్‌లో మెప్పించిన 'కాంచన' ఫ్రాంఛైజీకి కొత్త ఎడిషన్‌గా వస్తున్న 'కాంచన 4' కోసం రాఘవ లారెన్స్, రష్మికను సంప్రదించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Details

త్వరలోనే  'ది గర్ల్‌ఫ్రెండ్'  రిలీజ్

అయితే, సినిమాలోని ఓ ప్రత్యేకమైన రోల్ కోసం రష్మికను తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఒకవేళ రష్మిక 'కాంచన 4'లో భాగమైతే, ఇది ఆమె కెరీర్‌లో మరో మలుపు అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హారర్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండటం, అలాగే రష్మికకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్ కలిస్తే, ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రష్మిక నటించిన మరో సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్' కూడా త్వరలోనే విడుదల కానుంది. వరుసగా విభిన్న జానర్స్‌లో తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తున్న రష్మిక, ఇప్పుడు హారర్ ఫ్రాంఛైజీలో ఎంట్రీ ఇస్తుందా అన్నదే ఆసక్తికర చర్చగా మారింది.