
Rashmika-Vijay: హాయ్ నాన్న ఈవెంట్‌లో రష్మిక-విజయ్ ఫోటోలు.. నానిపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
నాని(Nani) హీరోగా, అందాల నటి మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) నటించిన తాజాగా చిత్రం 'హాయ్ నాన్న'.
సోల్ ఫుల్ ఫ్యామిలీడ్రామా తెరకెక్కిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది.
డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika) ఫోటోలను ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
స్విమ్మింగ్ ఫూల్‌లో రష్మిక, విజయ్ వేర్వేరుగా ఉన్న ఫోటోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.
Details
హీరో నాని క్షమాపణ చెప్పాలి
దీనిపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీ ప్రమోషన్ల కోసం వ్యక్తిగత విసయాలను వాడుకుంటున్నారా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
వెంటనే హీరో నాని క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
యాంకర్ సుమ (Suma) ఈ ఫోటో గురించి కామెడీగా స్పందించింది.
విజయ్, రష్మిక అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. కొంత మంది యాంకర్ సుమను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.