LOADING...
Rajamouli: హనుమంతుడు వ్యాఖ్యల తర్వాత మరో రెండు కేసులు: రాజమౌళికి పెరిగిన సమస్యలు
హనుమంతుడు వ్యాఖ్యల తర్వాత మరో రెండు కేసులు: రాజమౌళికి పెరిగిన సమస్యలు

Rajamouli: హనుమంతుడు వ్యాఖ్యల తర్వాత మరో రెండు కేసులు: రాజమౌళికి పెరిగిన సమస్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజమౌళి-మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన ఈవెంట్ ముగిసిన తర్వాత, దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానర సేన ఇప్పటికే ఒక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హనుమంతుడి గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తమ భావోద్వేగాలను దెబ్బతీశాయని వారు పోలీసులకు తెలియజేశారు. ఇదే అంశంపై చర్చ ఇంకా కొనసాగుతుండగా, సంస్థ మరో రెండు ఫిర్యాదులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు బయటపెట్టింది. వారి ఆరోపణల ప్రకారం.. ఈవెంట్‌లో మహేష్ బాబును నందిపై వచ్చినట్లుగా చూపించారు. నంది వాహనం శివుడికి మాత్రమే ప్రత్యేకమైందని, అలాంటి దైవిక ప్రతీకపై ఒక సినీ హీరోను చూపించడం అభ్యంతరకరమని రాష్ట్రీయ వానర సేన ప్రశ్నిస్తోంది.

వివరాలు 

ఒక సాధారణ మానవుడు ఇంద్రుడితో పోరాడుతున్నట్లు చూపించడం ఏమిటి? 

అంతేకాక, ఇటీవల బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా, బాహుబలి థియేటర్నల్ వార్ అనే కామిక్ సిరీస్‌కు సంబంధించిన ఒక ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. అందులో బాహుబలి రాక్షసుల తరఫున నిలబడి ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్లు చూపించారని సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. "ఒక సాధారణ మానవుడు ఇంద్రుడితో పోరాడుతున్నట్లు చూపించడం ఏమిటి? దేవతలను అవమానించే ప్రయత్నమా?" అని వారు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నడుమ, రాజమౌళిపై ఇంకా రెండు కొత్త ఫిర్యాదులు నమోదు చేయనున్నట్టు వానర సేన ప్రకటించింది. దీంతో రాజమౌళికి ఉన్న తలనొప్పులు కాస్త రెట్టింపు అయ్యాయని చెప్పక తప్పదు.