Scary Picture: కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ మూవీ.. టైటిల్ టీజర్ విడుదల చేసిన రానా!
ఈ వార్తాకథనం ఏంటి
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో టాలీవుడ్ దర్శకుడు రవిబాబు ఓ హారర్ సినిమాను తెరకెక్కించనున్నారు. 'స్కేరీ పిక్చర్' (Scary Picture) పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్ర బృందం వెల్లడించింది.
వివరాలు
టైటిల్ టీజర్ విడుదల
'స్కేరీ పిక్చర్' సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ సందర్భంగా సినిమా 2027లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. అయితే, 2027లో ఏ సమయంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
బాలీవుడ్‌లోనే విడుదలవుతుందా?
ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ బయటకు రావడంతో మరో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో తెలుగు పోస్టర్ కనిపించకపోవడంతో ఈ సినిమా బాలీవుడ్‌లో మాత్రమే విడుదలవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ సినిమాతో దర్శకుడు రవిబాబు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుండటం, రానా దగ్గుబాటి నిర్మిస్తుండటంతో 'స్కేరీ పిక్చర్'పై ఆసక్తి నెలకొంది.