Page Loader
Ravi Teja: టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజకు పితృవియోగం..
టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజకు పితృవియోగం..

Ravi Teja: టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజకు పితృవియోగం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ నటుడు రవితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. మంగళవారం రాత్రి, హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రవితేజ పెద్ద కుమారుడు కాగా,రెండో కుమారుడు భరత్ 2017లో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మూడో కుమారుడు రఘు కొన్ని చిత్రాల్లో నటిగా కనిపించారు. తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన రాజగోపాల్ రాజు, ఫార్మాసిస్ట్‌గా పనిచేశారు. ఉద్యోగ కారణంగా ఆయన ఎక్కువ కాలం ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల్లో గడిపారు. సినిమారంగ ప్రవేశానికి ముందు రవితేజ కూడా జైపూర్, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో నివసించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో రవితేజకు పితృవియోగం