Page Loader
సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్‌.. ఖరారైన ముహుర్తం 
ఖరారైన ముహుర్తం

సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్‌.. ఖరారైన ముహుర్తం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 27, 2023
06:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఈగల్‌ ఒకటి. డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం అదిరిపోయే వార్త అందించింది. 2024 జనవరి 13న, సంక్రాంతి సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈగల్‌ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యపాత్రలో కావ్య థాపర్ నటిస్తున్నారు. మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు గన్ పట్టుకున్న రవితేజ స్టిల్‌ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు గూస్‌ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈగల్ విధ్వంసం ఎలా ఉంటుందో ప్రదర్శించేందుకు సంక్రాంతి పండగ సమయంలో థియేటర్లో రవితేజ సందడి చేయనున్నారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్, మధుబాల సహా ఇతర నటీనటులు ప్రధాన తారగణంగా నిలిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాస్ మహారాజా రవితేజ ఈగల్‌ విడుదల డేట్ ఫిక్స్‌