LOADING...
Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త సినిమా.. 'అనార్‌కళి' టైటిల్ ఫిక్స్!
'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త సినిమా.. 'అనార్‌కళి' టైటిల్ ఫిక్స్!

Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త సినిమా.. 'అనార్‌కళి' టైటిల్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హిట్ లేదా ఫ్లాప్ గురించి పెద్దగా పట్టించుకోకుండా జెట్ స్పీడ్‌‌లో సినిమాలు కంప్లీట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈసారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని రవితేజ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ 'మాస్ జాతర' అనే పవర్‌ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.

Details

సంక్రాంతికి కానుకగా రిలీజ్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, 2025 మే నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే, 'మాస్ జాతర' పూర్తయిన వెంటనే రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'RT-76' అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు 'అనార్‌కళి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే 'అనార్‌కళి' సినిమాలో నటించే నటీనటుల వివరాలను అధికారికంగా చిత్రబృందం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.