Page Loader
RT 75 : రవితేజ 'మాస్ జాతర' టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..
రవితేజ 'మాస్ జాతర' టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..

RT 75 : రవితేజ 'మాస్ జాతర' టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజ్ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎలాగైనా సక్సెస్ సాధించాలనే సంకల్పంతో భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాను 'మాస్ జాతర'తో వస్తున్నాడు. ఈ సినిమాని బడా నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యా నిర్మిస్తున్నారు. ఇది రవితేజ కెరీర్‌లో 75వ సినిమా అవుతుంది. రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తెలంగాణ నేపథ్యం ఆధారంగా రూపొందిన కథతో వస్తుంది.'లక్ష్మణ్ భేరి' అనే పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.Embed

వివరాలు 

 80% పూర్తయిన సినిమా 

రవితేజ గాయపడ్డ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుపుతున్నారు. అరకు లో జరిగిన షెడ్యూల్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 17న హైదరాబాద్‌లో ప్రారంభమైంది, అని దర్శకుడు భాను బోగవరపు తెలిపారు. ఇప్పటివరకు సినిమా 80% వరకు పూర్తయింది. ఇటీవల, మాస్ జాతర టీజర్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. మాస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా, జనవరి 26న 'మాస్ జాతర' టీజర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. ధమాకా వంటి హిట్ ఆల్బమ్‌లకు సంగీతం అందించిన భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా రవితేజకు మాస్ బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రవన్న మాస్ దావత్ షురూ రా భయ్