Raviteja: సంక్రాంతికి రవితేజ కొత్త సినిమా.. 'దాగుడు మూతలు దండాకోర్' ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
'ఇరుముడి' బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. 'రాజా రాజా చోర' ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యువ హీరో శ్రీ విష్ణు కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం.
వివరాలు
త్వరలోనే పూర్తి వివరాలు..
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. హసిత్ గోలి తనదైన స్టైల్‌లో రవితేజను సరికొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు 'దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్‌టైన్‌మెంట్ హార్డ్‌కోర్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా టైటిల్‌తో పాటు ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.