Page Loader
Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు  
Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు

Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా "కెప్టెన్ మిల్లర్" ఈ రోజు తమిళ్ లో విడుదల అయ్యింది. తమిళ్ లో మిల్లర్ సినిమాకి హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో ధనుష్ టాప్ ట్రెండ్ అవుతున్నాడు. సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో... థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో తెలుగులో కెప్టెన్ మిల్లర్ సినిమా వాయిదా పడింది. తమిళ్ లో హిట్ అవ్వగానే తెలుగు థియేట్రికల్ రిలీజ్ డేట్ బయటకి వచ్చేసింది

Details 

రిపబ్లిక్ డే కానుకగా తెలుగులో వెర్షన్ విడుదల 

ఏషియన్ సినిమాస్,సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నిజనవరి 25,2024న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ రోజు విడుదలైన తమిళ వర్షన్ రివ్యూ విషయానికి వస్తే... ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని క్రిటిక్స్ టాక్. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ లో ధనుష్ అద్భుతంగా చేసాడని అంటున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో ధనుష్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ భారీ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, జాన్ కొక్కెన్, విజయకన్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్‌లు తదితరులు నటించగా, సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజ్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సురేష్ ప్రొడక్షన్స్ చేసిన ట్వీట్