Page Loader
Sharda Shinha: జానపద గాయని శారదా సిన్హా కన్నుమూత 
జానపద గాయని శారదా సిన్హా కన్నుమూత

Sharda Shinha: జానపద గాయని శారదా సిన్హా కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
11:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ జానపద గాయని శారద సిన్హా (72) మంగళవారం కన్నుమూశారు.ఆమె బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతూ,దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.బిహార్​కు చెందిన శారద సిన్హా,అత్యంత ప్రఖ్యాతి పొందిన జానపద గాయనీమణుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ఛత్ పండుగ సమయంలో ఆమె పాడే పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి.మైథిలి,భోజ్​పురి, మాగాహి జానపద సంగీతంలో ఆమె ఎన్నో అద్భుతమైన స్వరాలు అందించారు. సంగీత రంగంలో చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2018లో ఆమెకు పద్మ భూషణ్​ అవార్డును ప్రదానం చేసింది. 1950 అక్టోబర్ 1న బిహార్​లోని సుపాల్​ జిల్లా,హులాస్​ గ్రామంలో జన్మించిన ఆమె,72 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనుశుమాన్ సిన్హా చేసిన ట్వీట్