
Allu Arjun: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేయడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
ఈ చర్యలు కాంగ్రెస్ నేతలు, ఇతర రాజకీయ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Details
అభ్యంతరకర పోస్టులపై నిఘా
సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల ద్వారా అభ్యంతరకర పోస్టులు చేసే వారిపై కూడా నిఘా పెంచినట్లు సమాచారం.
అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తుండగా, కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై అసభ్య పదజాలం వాడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి పోస్టులు సమాజంలో వివాదాలు, కలహాలను రెచ్చగొడతాయని వారు పేర్కొన్నారు.
అయితే ఈ చర్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ భావాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేసే హక్కును కలిగి ఉన్నారని, ఇదంతా వారి వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొంటున్నారు.