LOADING...
Rhea Singha: టాలీవుడ్‌లోకి 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024'.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ 
ఫస్ట్‌ లుక్‌ రిలీజ్

Rhea Singha: టాలీవుడ్‌లోకి 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024'.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అందాల పోటీల్లో విజయం సాధించి, ఆ అక్కడి నుంచి సినిమాల వైపు అడుగులు వేసిన అందగత్తెలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి మరో యువ బ్యూటీ చేరుతోంది. ఆమెనే రియా సింఘా. విశేషమేమిటంటే... తన నటన ప్రయాణాన్ని నేరుగా తెలుగు సినిమాతోనే ప్రారంభిస్తోంది. కమెడియన్ సత్య హీరోగా, 'మత్తు వదలరా' ఫేమ్ దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం 'జెట్లీ'లో రియా హీరోయిన్‌గా అవకాశాన్ని అందుకుంది. రియాకు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ పోస్టర్‌లో యాక్షన్‌కు ప్రాధాన్యమున్న పాత్రలో ఆమె కనిపిస్తోంది. ఈ సినిమాలో 'శివానీ రాయ్' అనే క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.

వివరాలు 

 'మిస్ టీన్ గుజరాత్'

గుజరాత్‌కు చెందిన రియా కేవలం 18ఏళ్ల వయసులోనే 'మిస్ యూనివర్స్ ఇండియా-2024' కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇదే కాకుండా, ఏడాది ముందే 'మిస్ టీన్ గుజరాత్'తో పాటు'మిస్ టీన్ ఎర్త్'టైటిల్స్‌ను కూడా గెలుచుకుంది. 'మిస్ టీన్ గుజరాత్' విజయం సాధించిన తొలి గుజరాతీ యువతిగా రియా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన 'మిస్ యూనివర్స్ - 2024' పోటీల్లో టాప్ 30కి చేరి మరో ఘనతను నమోదు చేసింది. చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండే ఆమె, స్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుని రంగంలో అడుగుపెట్టింది. టెడెక్స్ స్పీకర్‌గా కూడా మాట్లాడిన అనుభవం ఉంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసి, ఇప్పుడు నటన వైపు తన కెరీర్‌ను మలుపు తిప్పుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'జెట్లీ'లో హీరోయిన్‌ గా రియా

Advertisement