LOADING...
RJ Balaji: థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్

RJ Balaji: థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
May 16, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ నటుడు సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నటుడు, దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొన్న అనంతరం మే 15 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ స్థాయి ప్రశంసలు రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ థియేటర్‌లో ఆర్‌జే బాలాజీ భావోద్వేగానికి లోనై హీరోయిన్ త్రిషను ఆలింగనం చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వివరాలు

ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన..

సుమారు రూ.140 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రానికి విడుదలకు ముందు పలు ఆర్థిక, సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. నిర్ణయించిన సమయానికి కొన్ని షోలు ప్రదర్శించలేకపోవడం, పైరసీ ముప్పు పెరగడం వంటి కారణాలతో చిత్ర యూనిట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే అన్ని సమస్యలను అధిగమించి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో చిత్రబృందం ఊపిరిపీల్చుకుంది.

వివరాలు

ఆనందంలో కంటతడి..

చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించిన ఆర్‌జే బాలాజీ, అభిమానుల స్పందనను చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. సినిమా మొత్తం ప్రేక్షకులు ఈలలు వేస్తూ, హర్షధ్వానాలతో సందడి చేయడంతో ఆయన ఆనందాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. గాల్లోకి పిడికిలి ఎత్తి సంబరాలు చేసుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో రోజుల శ్రమకు ఫలితం దక్కిన ఆనందంలో ఆయన కంటతడి పెట్టుకున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న డైరెక్టర్ వీడియో..

Advertisement