LOADING...
Mammootty: సీనియర్‌గా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు సరదగా ఉండవు
సీనియర్‌గా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు సరదగా ఉండవు

Mammootty: సీనియర్‌గా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు సరదగా ఉండవు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్‌ హీరోగా మారిన తర్వాత రొమాంటిక్‌ పాత్రలు సరదాగా అనిపించవని మమ్ముట్టి తెలిపారు. కొంతకాలం అనారోగ్య కారణంగా విరామం తీసుకున్న ఆయన, తిరిగి బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అప్‌కమింగ్ సినిమా 'కలాంకావల్‌' ప్రచారంలో పాల్గొని వరుస ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. 74 ఏళ్ల మమ్ముట్టి ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ అలరిస్తున్నారు. ఆయన 'కలాంకావల్‌'లో విలన్ పాత్రలో నటించినట్లు తెలిపారు. మమ్ముట్టి కెరీర్‌లో రొమాంటిక్‌ హీరోగా మాత్రమే కాకుండా యాక్షన్‌ హీరోగానూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడిగా మారిన తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

Details

వయసుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి

నేను రొమాంటిక్‌ పాత్రలు కావాలని అడిగితే.. ఆ పాత్రలకు తగిన కథలే దర్శకులు సిద్ధం చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటి పాత్రలు సరదాగా అనిపించవు. సీనియర్‌ నటుడిగా మారిన తర్వాత మన అనుభవం, వయసుకు తగిన పాత్రలను ఎంచుకోవడం ముఖ్యమే. అనుభవం తర్వాత వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హీరో పాత్రకు కొన్ని పరిమితులు ఉంటాయి.. కానీ విలన్ పాత్రకు ఎలాంటి నియమాలు ఉండవు. అలాంటి పాత్రల్లో నటించినప్పుడు మనలోని నిజమైన నటన బయటకు వస్తుందన్నారు. స్టార్ అయినప్పటికీ విలన్ పాత్రలు ఎంచుకోవడంపై ఆయన చెప్పారు.

Details

డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్

ఇలాంటి పాత్రల్లో నటించడానికి ధైర్యం కావాలి అని అందరూ అంటారు. కానీ, కొత్తపాత్రల్లో నటించాలనే తపన ముఖ్యం. ఒకే తరహా పాత్రలు చేస్తూ, నాలోని నటుడిని మర్చిపోకూడదు. కొత్తదనంతో నిండిన పాత్రలు చేయడం ద్వారా నటనకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. అలా చేస్తేనే నేను ఈ స్థాయికి చేరాను. నన్ను అగ్రహీరోగా పిలవడం వల్ల ఇబ్బంది లేదు. కానీ గొప్ప నటుడిని అని గుర్తించడం నాకు ఇంకా ఆనందం ఇస్తుంది. మమ్ముట్టి నటించిన 'కలాంకావల్‌' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement