Page Loader
Vijay - Rashmika: ముంబయి విమానాశ్రయంలో తళుక్కున మెరిసిన విజయ్‌ దేవరకొండ - రష్మిక
ముంబయి విమానాశ్రయంలో తళుక్కున మెరిసిన విజయ్‌ దేవరకొండ - రష్మిక

Vijay - Rashmika: ముంబయి విమానాశ్రయంలో తళుక్కున మెరిసిన విజయ్‌ దేవరకొండ - రష్మిక

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మికల ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట ఎక్కడ కనిపించినా ఫొటోగ్రాఫర్లు వాళ్లను కెమెరాలో బంధించేందుకు ఉత్సాహంగా ఉంటారు. తాజాగా ఈ ఇద్దరూ ముంబయి విమానాశ్రయంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం రాత్రి రష్మిక ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చి, అభిమానులతో కలిసి ఫోటోలు తీసుకుని ఆహ్లాదంగా గడిపింది. కొద్దిసేపటికి విజయ్ దేవరకొండ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ జంట క్రిస్మస్,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారనే ఊహాగానాలు అభిమానులలో మిన్నంటాయి.

వివరాలు 

రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌

ఇటీవలి కాలంలో రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ జంట రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే విజయ్, రష్మిక తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని ఎన్నిసార్లైనా స్పష్టం చేశారు. అయినప్పటికీ వీరి మీద వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయ్ దేవరకొండ తన డేటింగ్‌ రూమర్స్‌పై స్పందిస్తూ, ''సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను బయటపెడతాను'' అని చెప్పారు.

వివరాలు 

ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది: విజయ్ 

అలాగే, అపరిమితమైన ప్రేమ ఉంటుందా లేదా అనే విషయంలో తనకు స్పష్టత లేదని, ఉంటే దాని వెనుక బాధ కూడా ఉంటుందని, ఎవరినైనా ప్రగాఢంగా ప్రేమిస్తే ఆ బాధను సహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రేమ గురించి రష్మిక మాట్లాడుతూ, ''జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు చాలా ముఖ్యమే. నా దృష్టిలో ప్రేమ అనేది జీవిత భాగస్వామిని కలిగి ఉండడమే. మన ఒడుదొడుకుల్లో మనకు తోడు నిలిచి మద్దతు ఇచ్చేవారు లేకపోతే జీవితానికి పెద్దగా అర్ధం ఉండదు'' అని ఆమె వెల్లడించింది.