
hari hara veera mallu tickets: 'హరి హర వీరమల్లు' టికెట్ల కోసం హడావుడి.. ఏపీలో రూ.1000 దాటిన ధరలు!
ఈ వార్తాకథనం ఏంటి
బాక్సాఫీస్ దగ్గర మరోసారి రచ్చ రేపే సమయం దగ్గర పడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' జులై 24న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో 'బుక్ మై షో', 'డిస్ట్రిక్ట్' వంటి ఆన్‌లైన్ టికెటింగ్ వేదికలపై బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం సీట్లు కేవలం కొద్దిసేపు లోపే 'సోల్డ్ అవుట్'గా మారాయి. అలాగే ఏపీలోని కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షో టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Details
ఏపీలో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సినిమా బృందం టికెట్ ధరలను పెంచుకుంది. ఏపీలో పెయిడ్ ప్రీమియర్ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ప్రీమియర్ షోలను ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో ఏర్పాటు చేశారు రెక్లైనర్/సోఫా సీటు: రూ.1000+ బాల్కనీ: రూ.830 సెకండ్ క్లాస్: రూ.790 జులై 24 నుండి మల్టీప్లెక్స్‌లలో సాధారణ షోలకు కూడా పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులో ఉన్నాయి రాయల్ సీటింగ్: రూ.495 ఎగ్జిక్యూటివ్ సీటింగ్: రూ.377 (బుకింగ్ ఛార్జీలు అదనం) సింగిల్ స్క్రీన్‌లలో ధరలు ఇలా ఉన్నాయి బాల్కనీ: రూ.250 ఫస్ట్ క్లాస్: రూ.150
Details
తెలంగాణలో పరిస్థితి
తెలంగాణలో కూడా 'హరి హర వీరమల్లు' టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, పెయిడ్ ప్రీమియర్ షోలకు బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. రెగ్యులర్ షోలకు ధరలు ఇలా ఉన్నాయి మల్టీప్లెక్స్ రాయల్ సీటింగ్: రూ.500 ఎగ్జిక్యూటివ్ సీటింగ్: రూ.413 సింగిల్ స్క్రీన్ బాల్కనీ: రూ.300 ఫ్రంట్ సర్కిల్: రూ.200 (అన్ని టికెట్ ధరలపై బుకింగ్ ఛార్జీలు అదనం) భారీ బడ్జెట్, పవన్ కల్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోనున్న ఈ సినిమా.. విడుదలకు ముందే టికెట్ బుకింగ్స్ రూపంలో సంచలనం సృష్టిస్తోంది.