Page Loader
Bahubali3-S.S.Rajamouli-Animated series:బాహుబలి 3పై కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి
దర్శక దిగ్గజం ఎస్​ ఎస్​ రాజమౌళి

Bahubali3-S.S.Rajamouli-Animated series:బాహుబలి 3పై కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి

వ్రాసిన వారు Stalin
May 01, 2024
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (S.S.Rajamouli) బాహుబలి(Bahubali3) చిత్రంపై మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చారు. బాహుబలి సినిమాతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 3 ఉందని ఇదివరకు వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి పై అప్పటినుంచి ప్రేక్షకులు ఏదో ఒక అప్డేట్ రాకపోతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 కి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని రాజమౌళి వెల్లడించారు.

S.S.Rajamouli-Animated series

త్వరలోనే ట్రైలర్​ తో మీ ముందుకు అంటూ పోస్ట్ చేసిన రాజమౌళి

త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎస్.ఎస్ రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో ''మాహిష్మతి ప్రజలు ఆయన పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు ఈ విశ్వంలోని ఏ శక్తి ఆయన తిరిగి రావడాన్ని లేదు 'బాహుబలి- క్రౌన్ ఆఫ్ బ్లడ్' యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ త్వరలో మీ ముందుకు'' అని పోస్ట్ చేశారు. రాజమౌళి ఎలా పోస్ట్ చేశారో లేదో కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కథానాయకుడిగా యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరా వేగంగా కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజమౌళి పోస్ట్​ చేసిన బాహుబలి 3 యానిమేటెడ్​ సిరీస్​ అప్​ డేట్