LOADING...
Sai Pallavi: 'నా పేరు పెట్టింది సాయిబాబానే'.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్
'నా పేరు పెట్టింది సాయిబాబానే'.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్

Sai Pallavi: 'నా పేరు పెట్టింది సాయిబాబానే'.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక పుష్పాలతో భక్తులు సత్యసాయి మహా సమాధిని అందంగా అలంకరించారు. హిల్ వ్యూ స్టేడియం వేడుకలను ముందుంచుకుని సంపూర్ణంగా సిద్ధమైంది. భద్రతా పరంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వర్ణ రథంపై సత్యసాయి చిత్రపటాన్ని హిల్ వ్యూ స్టేడియం పరిసరాల్లో సత్యసాయి ట్రస్ట్ ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా, గతంలో హీరోయిన్ సాయి పల్లవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.

Details

నేను సాయి బాబా భక్తురాలినే

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి తెలిపింది. మా అమ్మ తాతయ్య సాయిబాబు భక్తులు. మా అమ్మ, అత్తమ్మ, మావయ్య అందరూ సాయిబాబా యూనివర్సిటీలోనే చదివారు. చిన్నప్పటి నుంచే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లేవారు. పుట్టపర్తి సాయిబాబా స్వామి స్వయంగా నాకు పేరు పెట్టారు. దీవించి 'సాయి పల్లవి' అనే పేరు ఇచ్చారు. 14-15 ఏళ్లు వచ్చిన తరువాత నా పేరు నాకు ఇంకా బాగా నచ్చింది. చాలా ప్రత్యేకంగా అనిపించింది. నేనూ సాయిబాబా భక్తురాలినే. సత్యసాయి బోధనలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడిని దాటడం, క్రమశిక్షణ, సేవా భావం... ఇవన్నీ నేను ఆయన ద్వారా నేర్చుకున్నవి అని ఆమె పేర్కొంది.