Page Loader
Sai Pallavi Bollywood Movie: బాలీవుడ్‌లోకి సాయి పల్లవి అరంగేట్రం.. 'ఏక్ దిన్' విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం
బాలీవుడ్‌లోకి సాయి పల్లవి .. 'ఏక్ దిన్' విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

Sai Pallavi Bollywood Movie: బాలీవుడ్‌లోకి సాయి పల్లవి అరంగేట్రం.. 'ఏక్ దిన్' విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఏక్ దిన్' ద్వారా టాలెంటెడ్ నటి సాయి పల్లవి హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈచిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా,ఈ సినిమా నవంబర్ 7వతేదీన విడుదల కానుందని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈచిత్రాన్ని ఆమిర్ ఖాన్‌తో పాటు ప్రముఖ నిర్మాత మన్సూర్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆమిర్ ఖాన్-మన్సూర్ ఖాన్ ద్వయం సుమారు 17ఏళ్ల విరామం తరువాత ఈసినిమాతో మళ్లీ కలసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమా'జానే తూ... యా జానే నా'మంచి విజయం సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఏక్ దిన్' విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం