
Ramayana: సాయిపల్లవి-రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' ఫస్ట్ లుక్ రేపే.. 9 నగరాల్లో స్క్రీనింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్ జంటగా నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ చిత్రం 'రామాయణ' ఇప్పుడు మరింత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మేజర్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను రేపు ఉదయం 11.30 గంటలకు దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో 9 థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Details
హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో స్క్రీనింగ్
హైదరాబాద్‌లో అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్‌లో ఈ ప్రత్యేక స్క్రీనింగ్ జరగనుంది. మిగిలిన నగరాల్లో బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, కోల్‌కత్తా, కొచ్చి ఉన్నాయి. ఈ గ్లింప్స్ స్క్రీనింగ్‌కు మీడియాతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఇక ఈ సినిమాకు సంగీతం విషయంలో గ్లోబల్ లెవెల్ హైప్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే భారత సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్‌తో పాటు హాలీవుడ్ మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మెర్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
Details
రామయాణంపై మరింత హైప్
రావణుడిగా కన్నడ రాక్‌స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన షూటింగ్ ముంబయిలో వేసిన గ్రాండ్ సెట్స్ లో వేగంగా జరుగుతోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదలతో రామాయణపై హైప్ మరింత పెరగడం ఖాయం.