Page Loader
#SDT18: ధైర్యం, ఆశ ఆధారంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్!

#SDT18: ధైర్యం, ఆశ ఆధారంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైవిధ్యమైన కథలతో ముందుకు సాగుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నారు. 'విరూపాక్ష', 'బ్రో' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత, ఆయన కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ రోజు సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా #SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాను 'హనుమాన్' వంటి బ్లాక్‌బస్టర్‌ను నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలో, "ధైర్యం కవచం, ఆశ ఆయుధం" అనే శక్తివంతమైన క్యాప్షన్‌తో హీరోను పరిచయం చేస్తున్నారు.