Page Loader
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి.. నిందితుడి అరెస్ట్
సైఫ్ అలీఖాన్ పై దాడి.. నిందితుడి అరెస్ట్

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి.. నిందితుడి అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన ఈ దాడి ప్రభుత్వ వైఫల్యమని అంటున్నాయి. ఈ నేపథ్యంలో, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ, సినీ కళాకారుల భద్రతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన అనంతరం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాలు 

సైఫ్‌పై కత్తితో దాడి

సైఫ్‌పై దాడి చేసిన తర్వాత దుండగుడు ముంబై లోకల్ ట్రెయిన్‌లో వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. జనవరి 16న అర్దరాత్రి,నిందితుడు సైఫ్,కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత, సైఫ్‌ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లిన అతడిని కేర్ టేకర్ అడ్డుకుంది. ఆమెపై దాడి చేస్తున్న సమయంలో,సైఫ్ మరో గదిలో ఉన్నాడు.సైఫ్ బయటకు వచ్చి నిందితుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా,దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన సైఫ్ అతని పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సహాయంతో తండ్రిని ఆటోలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

వివరాలు 

సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం

ఈ ఘటన తర్వాత సైఫ్‌కి వెన్నెముక ఆపరేషన్ చేసి రెండు అంగుళాల కత్తి ముక్కను శస్త్రచికిత్స ద్వారా తీసేశారు. ప్రస్తుతం, సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ కేసు గురించి విచారణ ప్రారంభించిన పోలీసులు, సైఫ్ ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.