Saindhav : 'రాంగ్ యూసేజ్' చేయొద్దన్న వెంకీ.. సైంధవ్ ఫస్ట్ సింగిల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్ 75 చిత్రం సైంధవ్ నుంచి అభిమానులకు, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మేరకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
'రాంగ్ యూసేజ్' అంటూ సాగే ఈ పాటకి సంతోష్ నారాయణ సంగీతం సమకూర్చారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. నాకాష్ అజిజ్ పాటని ఆలపించారు.
డబ్బు, సెల్ ఫోన్, మద్యం ఇటువంటి వాటిని తప్పు పద్ధతిలో ఉపయోగించకు అంటూ చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ పాటకి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. దీంతో వెంకీ మామ తన స్టైల్'తో ఆకట్టుకుంటున్నారు.
హిట్ సినిమా ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
DETAILS
జనవరి 13న రిలీజ్ కానున్న సైంధవ్
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
మరోవైపు ఫ్యామిలీ హీరో వెంకటేష్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ చాలా కాలం తర్వాత వస్తోంది. ఈ క్రమంలోనే వెంకీ మామ అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమా జనవరి 13న కోసం మెరుగులు దిద్దుకుంటోంది.సైంధవ్ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
తమిళ్ హీరో ఆర్య మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది.