
Saindhav trailer: సూపర్ ఎమోషన్స్ తో వెంకీ.. అదిరిపోయిన సైంధవ్ ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
చాలా గ్యాప్ తర్వాత, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్‌తో విక్టరీ వెంకటేష్ మళ్లీ యాక్షన్ జోనర్‌లోకి వచ్చాడు.
ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
వెంకటేష్,బేబీ సారా మధ్య బంధాన్ని అన్వేషించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. saiko పాత్రలో నటించిన వెంకటేష్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం.
అంతా బాగానే ఉందనుకున్న సమయంలో తన కుమార్తెకి "స్పైనల్ మస్కులర్ అట్రోఫీ" అనే వైద్య సమస్యతో బాధపడుతోందని తెలుసుకుంటాడు.
Details
ట్రైలర్‌లో వెంకీని యాక్షన్ పీక్స్
ఆ చిన్న అమ్మాయికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు. దాని కోసం వెంకటేష్ ఏమి చేశాడు? ఆ ఖరీదైన ఇంజక్షన్ కోసం అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? నవాజుద్దీన్ సిద్ధిక్‌తో శత్రుత్వానికి కారణం ఏమిటి? అసలు ఈ సైంధవ్ ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు 13 జనవరి 2024న తెలుస్తాయి.
విక్టరీ వెంకటేష్ ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల నటుడు. ట్రైలర్‌లో వెంకీని యాక్షన్ పీక్స్. యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకటేష్ అద్భుతంగా నటించాడు.
సైంధవ్ గా వెంకటేష్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. భావోద్వేగాలతో పాటు సైంధవ్ తాలుకా వెయిట్ ని దర్శకుడు క్యారీ చేసిన విధానం మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి.
Details
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ హైలైట్
నిర్మాణ విలువలు,విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సైంధవ్ ఎలా ఉంటుందో ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది.
సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, ఆర్య, ముఖేష్ రిషి, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు.సైంధవ్
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సైంధవ్ థియేట్రికల్ ట్రైలర్
#Saindhav's final mission begins :)#SaindhavTrailer out now!
— Venkatesh Daggubati (@VenkyMama) January 3, 2024
-https://t.co/FW7ZrXlm28
See you at the cinemas from Jan 13th! pic.twitter.com/YuP9Emv3WR