Naga Chaitanya: సాయిపల్లవి అంటే రెస్పెక్ట్.. కానీ కొంచెం భయం కూడా ఉంది.. చైతూ
టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో ఓ గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ తర్వాత పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం వంటి సినిమాల్లో తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఇటీవల రానా దగ్గుబాటి హోస్ట్‌గా కొనసాగుతున్న ది రానా దగ్గుబాటి షోలో గెస్ట్‌గా హాజరైన నాగ చైతన్య, సాయిపల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోలో రానా, చైతూ నుండి సాయిపల్లవి గురించి మాట తీయగా, చైతన్య తన అనుభవాన్ని ఇలా చెప్పాడు.
తండేల్ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి
సాయిపల్లవితో నటించాలన్నా, ముఖ్యంగా డాన్స్ చేయాలన్నా చిన్న భయమే వస్తుంది బావ. విరాట పర్వం సినిమాలో ఒక్క పాట కూడా లేకుండా ఆమెతో తప్పించుకున్నావు. కానీ నా దగ్గర మాత్రం అలా కాదు. తాను ఎంత అద్భుతంగా చేస్తుందో చూస్తుంటే, నేను సరైనంగా చేస్తున్నానా అన్న సందేహం వస్తుందని చెప్పాడు. నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో, సాయిపల్లవి మీద అభిమానుల మధ్య ఆసక్తి మరింత పెరిగింది. సాయిపల్లవితో నటించడమే కాకుండా, ఆమెను మెచ్చుకోడం కూడా చైతన్య అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. ఇక తండేల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సాయిపల్లవి నటన, నాగ చైతన్య మాయాజాలం కలయికతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.