సెప్టెంబర్ 28న సలార్, వ్యాక్సిన్ వార్ రిలీజ్.. మరోసారి పోటీ పడనున్న ప్రభాస్, వివేక్ రంజన్
రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ది వ్యాక్సిన్ వార్ (THE VACCINE WAR) సైతం ఇదే రోజున విడుదలవుతోంది. వార్ సినిమాలో నానా పటేకర్,పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. వార్ చిత్రంపై అగ్నిహోత్రి భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. గతేడాది 2022 మార్చి 11న విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ భారతీయ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని సాధించుకుంది. అదే రోజున రిలీజైన ప్రభాస్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ప్లాప్ అవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ - అగ్నిహోత్రి సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటం కొసమెరుపు.