Page Loader
Salar : ప్రభాస్‌,పృథ్వీరాజ్‌ పాత్రలు లీక్.. స్వయంగా చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌
Salar : ప్రభాస్‌,పృథ్వీరాజ్‌ పాత్రలు లీక్.. స్వయంగా చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్వయంగా చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌

Salar : ప్రభాస్‌,పృథ్వీరాజ్‌ పాత్రలు లీక్.. స్వయంగా చెప్పిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 29, 2023
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` సినిమా కథపై ఇన్నాళ్లు జోరుగా చర్చ సాగేది. కానీ తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథపై స్పందించారు. ఈ మేరకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చేశాడు. పాన్ ఇండియా మొత్తం `సలార్‌` సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ నటించిన సినిమా ఒక ఎత్తు అయితే, కేజీఎఫ్‌ లాంటి సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరో ఎత్తు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ప్రభాస్‌ పూర్తిస్థాయిలో మాస్‌ రోల్‌ చేయడం మరో విశేషం. గత సినిమానలకు భిన్నంగా `సలార్‌`గా ప్రభాస్ సరికొత్తగా కనువిందు చేయనున్నారు.

DETAILS

ఫ్రెండ్స్ అతి పెద్ద శతృవులుగా ఎందుకు మారారు అన్నదే సలార్

సలార్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంగ్లీష్‌ మీడియాతో ముచ్చటిస్తూ `సలార్` స్టోరీ లీక్‌ చేసేశారు. సింపుల్‌గా ఒకటే లైన్‌లో కథను తేల్చేశారు. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య కథ అన్నారు. ఈ మేరకు ఫ్రెండ్స్ అతి పెద్ద శతృవులుగా ఎందుకు మారారు,ఎలా మారారు అన్న అంశం ఇద్దరి మధ్య జరిగే బిగ్ ఫైట్ ఈ సినిమా కథ అన్నారు. సినిమాలో ఫ్రెండ్‌షిప్‌ కోర్ పాయింట్‌ అన్న నీల్,ఈ కథని చెప్పేందుకు 2 పార్ట్'లుగా చెప్పనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తాను రాసినా కథ ఏదైనా అందులో భావోద్వేగాలకు పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. తొలుత బంధాలు, తల్లి, తండ్రి భావోద్వేగాలు చూపిస్తానని,ఆ తర్వాతే యాక్షన్‌లోకి దిగుతానన్నారు. సలార్ కూడా ఇదే కోవలో ఉంటుందన్నారు.