Samantha-Ma Inti Bangaram: 'మా ఇంటి బంగారం' గా సమంతా... అభిమానులకు సమంతా బర్త్ డే గిఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ సమంత (Samantha) తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా మంచి ట్రీట్ ను ఇచ్చింది.
పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది.
ట్రాలాల మూవీ పిక్చర్స్ బ్యానర్ పై సొంత నిర్మాణం సంస్థలో నిర్మిస్తున్న సినిమా టైటిల్ను అభిమానులకు షేర్ చేసింది.
సినిమా పేరు మా ఇంటి బంగారం (Maa Inti Bangaram).
సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ ఫిలిం గా రూపుదిద్దుకుంటుంది.
అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
Samantha-New Project
మండోవా మీడియా వర్క్స్తో ఒప్పందం...
హైదరాబాద్ కు చెందిన ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ మండోవా మీడియా వర్క్స్ తో సమంత ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది.
వీరి భాగస్వామ్యంలో వెబ్ సిరీస్ తో పాటు సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్ రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమాకు సంబంధించి పోస్టర్ ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు షేర్ చేసింది.
చీరకట్టులో పట్టుకుని ఉన్న పోస్టర్ అయితే క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తోంది.