Samantha : సమంతా ఇంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ.. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నానంటున్న సామ్
టాలీవుడ్ అగ్రతార సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు ఆమె గతంలోనే వెల్లడించారు. ఇదే సమయంలో ప్రపంచంలోని పలు అందమైన ప్రదేశాలు, దేశాలు చుట్టేస్తున్నారు.ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ మరో పక్క ఆహ్లాదకర ప్రదేశాలను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సమంత తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్న ఫోటోని, క్రిస్మస్ ట్రీ వీడియోని పోస్ట్ చేశారు. తన ఇంట్లో క్రిస్మస్ ఏర్పాట్లను ఫొటోలు, వీడియోల రూపంలో తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. అయితే తను షేర్ చేసిన ఓ వీడియోకి హ్యాపీ హాలిడేస్ అని పోస్ట్ చేశారు.హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.సమంత పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.