
Samantha: 'వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను': సమంత ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
నటి సమంత (Samantha) తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
వారి ప్రేమ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇటీవల చెన్నై వేదికగా జరిగిన బిహైండ్‌వుడ్స్ అవార్డుల వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2010 నుండి స్ఫూర్తిదాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నందుకు ఆమెను కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు.
అవార్డు అందుకున్న అనంతరం, సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
మీ ప్రేమను చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు.
''ఈఅవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.ముఖ్యంగా కె. బాలచందర్ సర్ పేరుతో ఇది రావడం మరింత గర్వకారణం.ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను సృష్టించారు.ఆయన సినిమాల్లో మహిళా పాత్రలు ఎంతో సహజంగా,ప్రేరణ కలిగించేలా ఉంటాయి.ఆయన నుంచి నేనెంతో నేర్చుకున్నాను.ఈరోజు నా జీవితం పరిపూర్ణంగా అనిపిస్తోంది.నన్ను ఈఅవార్డుకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ప్రేక్షకుల ప్రేమ లభిస్తుంది. కానీ,రెండు సంవత్సరాల నుంచి తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు.ఇటీవల పెద్ద హిట్ కూడా లేదు.అయినా మీరు నాపై చూపించే ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు.ఈ ప్రేమకు నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది.నా మాటలు కూడా రావడం లేదు.మీరు లేకుండా నేను లేను''అని సమంత భావోద్వేగంతో తెలిపారు.
వివరాలు
సమంత సినీ ప్రయాణం
అభిమానులు ఆమెను డ్యాన్స్ చేయమని కోరగా, సమంత నవ్వుతూ ''ఇప్పుడే యాక్షన్ సీక్వెన్స్ చేసి వచ్చా, డ్యాన్స్ చేయడం కష్టంగా ఉంది'' అని చెప్పి అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చెన్నైకు చెందిన సమంత,'ఏ మాయ చేశావే' సినిమా ద్వారా నటిగా పరిచయమయ్యారు.
కెరీర్ ప్రారంభం నుంచి తెలుగు,తమిళ సినిమాల్లో వరుస విజయాలను అందుకున్నారు.
2022లో విడుదలైన 'కాతు వక్కుల రెండు కాదల్' తర్వాత తమిళ చిత్రపరిశ్రమలో ఆమె కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు.
సమంత ఇటీవల సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు.తాజాగా ఆమె'సిటడెల్ హనీ బన్నీ'ద్వారా ప్రేక్షకులను అలరించారు.
ప్రస్తుతం ఆమె చేతిలో 'రక్త బ్రహ్మాండ','మా ఇంటి బంగారం'సినిమాలు ఉన్నాయి.ఆమె నిర్మాతగా వ్యవహరించిన 'శుభం'సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.