LOADING...
Samantha: ఆరోగ్య సమస్యలతో మళ్లీ హాస్పిటల్లో సమంత.. అసలు ఏమి జరిగింది?
ఆరోగ్య సమస్యలతో మళ్లీ హాస్పిటల్లో సమంత.. అసలు ఏమి జరిగింది?

Samantha: ఆరోగ్య సమస్యలతో మళ్లీ హాస్పిటల్లో సమంత.. అసలు ఏమి జరిగింది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్‌లు చేసినా యాక్టింగ్‌ను పూర్తిగా పక్కనబెట్టినట్టు కనిపిస్తోంది. మరోవైపు త్రలాలా పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సమంత, 'శుభం' అనే సినిమాను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడివరకు అన్నీ సజావుగానే ఉన్నా తాజాగా ఆమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో పోస్ట్ చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి 'శాకుంతలం' సినిమా ప్రమోషన్ల సమయంలో, తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించారు.

Details

సమంత ఆరోగ్యంపై పలు అనుమానాలు?

దీని కోసం కొన్నాళ్లు చికిత్స కూడా తీసుకున్నారు. మధ్యలో 'ఖుషి' సినిమా చేసినా మరో పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు. ప్రస్తుతం సమంతను చూస్తే సాధారణంగానే కనిపిస్తున్నా, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. హాస్పిటల్ బెడ్ మీద పడుకుని సెలైన్ తీసుకుంటున్న ఫొటోని షేర్ చేయడంతో, ఆమె అనారోగ్యం ఇంకా పూర్తిగా తగ్గలేదా? చికిత్స ఇంకా కొనసాగుతోందా? అనే చర్చలు మొదలయ్యాయి.