Page Loader
న్యూయార్క్ వీధుల్లో సమంత: లుక్ మార్చేసి స్టయిల్ గా కనిపిస్తున్న ఖుషీ హీరోయిన్ 
న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సమంత

న్యూయార్క్ వీధుల్లో సమంత: లుక్ మార్చేసి స్టయిల్ గా కనిపిస్తున్న ఖుషీ హీరోయిన్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 25, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్న భామ, ప్రస్తుతం నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించింది. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో సమంత పంచుకుంది. ఈ ఫోటోల్లో సమంత కొత్తగా కనిపిస్తోంది. ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి, క్యాప్ పెట్టుకుని కొత్తగా కనిపిస్తుంది సమంత. నేచురల్ హిస్టరీ మ్యూజియంలో వివిధ కళారూపాల దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు చిన్నపాటి వీడియోలను సమంత షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అదలా ఉంచితే, సమంత నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలోకి వస్తుంది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

సమంత ఇన్స్ టా గ్రామ్ పోస్ట్