తదుపరి వార్తా కథనం
మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్
వ్రాసిన వారు
Sriram Pranateja
Aug 01, 2023
03:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఖుషి, సిటాడెల్ ప్రాజెక్టుల షూటింగులు పూర్తి చేసేసి ఆరోగ్యం మీద దృష్టిపెట్టడానికి సినిమాలకు సమంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఇండోనేషియా బాలి లో ప్రకృతి అందాల నడుమ సేదదీరుతున్న సమంత, తాజాగా ఇన్స్ టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
మట్టితో బొమ్మలు చేయడం, చెక్క రూఫ్ సాయంతో జలపాతాన్ని దాటడం సహా సమంత చాలా ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్ తో బాలిలో జాలీగా గడిపేస్తోంది.
అంతేకాదు, తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
మయోసైటిస్ నుండి పూర్తిగా బయటపడడానికి మానసికంగా తనను తాను దృఢం చేసుకుంటుందని, అందుకే ప్రకృతి అందాలను ఆస్వాదించే పనిలో ఉందని కొందరు అంటున్నారు.