
శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు?
ఈ వార్తాకథనం ఏంటి
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, మధుబాల, సచిన్ ఖేడ్కర్, అనన్య నాగళ్ల తదితరులు
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కథ:
విశ్వామిత్రుడు తప్పసు చేస్తుంటే ఆయన తపస్సును భగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతో భూమి మీదకు వచ్చిన మేనక, విశ్వామిత్రుడితో ప్రేమలో పడుతుంది. తద్వారా ఓ బిడ్డకు జన్మనిస్తుంది.
అయితే మానవులుగా జన్మించిన వారికి దేవలోకంలోకి ప్రవేశం లేదు కాబట్టి ఆ బిడ్డను భూమి మీదే ఉంచి వెళ్తుంది. అలా ఆ బిడ్డ కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుతుంది.
ఆ బిడ్డకు శకుంతలగా నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తాడు కణ్వమహర్షి.
Details
శకుంతలను వదిలి వెళ్ళిన దుష్యంతుడు
ఒకరోజు కణ్వాశ్రమానికి వచ్చిన దుష్యంతుడు(దేవ్ మోహన్) శకుంతల (సమంత)ను చూసి ప్రేమలో పడతాడు. పెళ్ళి చేసుకుంటారు.
కాకపోతే రాజ్యానికి తీసుకెళ్ళడానికి కొంత సమయం కావాలని తను మాత్రం రాజ్యానికి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. దుష్యంతుడు వస్తాడని ఎదురుచూస్తూ ఉన్న శకుంతల, ఎంతకీ రాకపోవడంతో తనే రాజ్యానికి వెళ్తుంది. అప్పటి తను గర్భవతి.
రాజ్యంలో శకుంతలను చూసిన దుశ్యంతుడు తనెవరో తెలియదని అంటాడు. అసలు ఎందుకు తెలియదంటాడు? దానికి కారణమేంటి? ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారనేదే కథ.
details
సినిమా ఎలా ఉందంటే:
శాకుంతలం సినిమా నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం శకుంతల, దుష్యంతుడుల మధ్య ప్రేమను చూపిస్తారు. కొన్ని కొన్ని చోట్ల ఇవి నీరసంగా ఉంటాయి.
దూర్వాస ముని పాత్రలో మోహన్ బాబు ఆసక్తికరంగా కనిపిస్తారు. వెండితెర మీద గ్రాఫిక్స్ షాట్స్ ఈజీగా తెలిసిపోతుంటాయి. నిర్మాణ విలువలు ఇంకాస్త బాగుంటే ప్రేక్షకులకు మంచి త్రీడీ అనుభవం దక్కేది.
ప్లస్ పాయింట్స్:
సమంత, మోహన్ బాబు పాత్ర, ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో అల్లు అర్హా ఎంట్రీ బాగున్నాయి. ఇంకా మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ప్లస్ గా చెప్పవచ్చు.
మైనస్ పాయింట్స్:
సమంత సొంత డబ్బింగ్, నెమ్మదిగా సాగే కథనం.