Page Loader
ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్: చిన్మయి మాటలపై సమంత ఎమోషనల్ పోస్ట్ 
ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో సమంత, చిన్మయి

ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్: చిన్మయి మాటలపై సమంత ఎమోషనల్ పోస్ట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 16, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో జోరు పెంచుతూ నిన్న సాయంత్రం ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత గురించి చిన్మయి చాలా గొప్పగా మాట్లాడారు. సమంత చాలా ధైర్యవంతురాలని, తెలుగులో తన డబ్బింగ్ కెరీర్ సమంతతోనే మొదలయ్యిందని ఆమె అన్నారు. అంతేకాదు, ఎంతోమంది అమ్మాయిలకు సమంత స్ఫూర్తిగా నిలుస్తుందనీ, తనకు తెలిసిన ఈ ప్రపంచంలో సమంత అందరికంటే గొప్పదని అంటూ తనదైన శైలిలో పాట పాడారు. ప్రస్తుతం సమంత గురించి చిన్మయి మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.

Details

సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఖుషి 

సింగర్ చిన్మయి మాటలకు సమంత ఎమోషనల్ అయ్యారు. ఇన్స్ టాగ్రామ్ స్టోరీలో, చిన్మయి పాప, నిన్నటి రోజును ప్రత్యేకమైన రోజును మార్చినందుకు చాలా థ్యాంక్స్, ఆ భగవంతుడు నీ మనసు లాగే నీకు మంచి గొంతునిచ్చాడని పోస్ట్ పెట్టారు. అదలా ఉంచితే, సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఖుషి, సిటాడెల్ చిత్రాల తర్వాత ఆమె మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. కొన్నిరోజులు సినిమాల నుండి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని బాగుచేసుకోవాలని సమంత భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇండోనేషియా బాలి దీవుల్లో ప్రకృతి ఒడిలో గడిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో విడుదల అవుతుంది.