Page Loader
Samantha: సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. ఒంటరితనం భయంకరంగా అనిపిస్తుంది
సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. ఒంటరితనం భయంకరంగా అనిపిస్తుంది

Samantha: సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. ఒంటరితనం భయంకరంగా అనిపిస్తుంది

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సమంత తన జీవితానికి సంబంధించిన విశేషాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే,తన ప్రయాణ అనుభవాలను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా సమంత చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆమె మూడురోజుల పాటు ఫోన్‌ లేకుండా గడిపిన అనుభవాన్ని వెల్లడించారు. ''మూడు రోజుల పాటు పూర్తిగా మౌనంగా గడిపాను.ఫోన్‌ లేదు,ఎవ్వరితోనూ సంభాషణ లేదు.కేవలం నేను మాత్రమే ఉన్నాను. మనమే మనకు ఒంటరిగా ఉండటం చాలా క్లిష్టమైన విషయం.కొన్నిసార్లు భయంకరంగా కూడా అనిపిస్తుంది.అయితే,నేను మాత్రం ఇలాంటి మౌనక్షణాలను ఆస్వాదిస్తాను. అవసరం అయితే,మిలియన్‌సార్లు కూడా ఇలాంటి సమయాన్ని గడపాలని అనుకుంటాను. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి,''అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

వివరాలు 

సినిమా రంగంలో సమంత  

తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో మహిళా ప్రాధాన్యత కలిగిన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమంత, మరోవైపు ఓటీటీ వేదికల్లో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన సత్తా చాటుతున్నారు. ఆమె, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'సిటడెల్‌: హనీ బన్నీ' (Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్‌ ఇటీవల ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డు అందుకుంది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా ఈ గౌరవాన్ని దక్కించుకుంది.

వివరాలు 

''మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశా'': సమంత 

ప్రస్తుతం సమంత 'రక్త్‌బ్రహ్మాండ్‌' సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి 'ది బ్లడీ కింగ్‌డమ్‌' అనే ఉపశీర్షిక ఉంది. 'తుంబాడ్‌' ఫేమ్‌ రాహి అనిల్‌ బార్వే ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఇటీవలే జాయిన్‌ అయినట్లు సమంత తెలిపారు. ''మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశా'' అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటివరకు తెరపైకి రాని ఓ విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో ఆదిత్యరాయ్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.